కుప్పంలో ఓటు లేని చంద్రబాబు స్పెషల్ ఫ్లయిట్ లో ఎందుకు వెళుతున్నారు?: లేళ్ల అప్పిరెడ్డి

  • కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్
  • టీడీపీపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
  • చంద్రబాబుపై లేళ్ల అప్పిరెడ్డి విమర్శనాస్త్రాలు
  • రాజకీయ విలువలు మంటగలుపుతున్నారని వ్యాఖ్యలు
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. కుప్పంలోనూ, నారావారిపల్లెలోనూ చంద్రబాబుకు ఓటు లేదని అన్నారు. కానీ కుప్పం వెళ్లాలని చంద్రబాబు స్పెషల్ ఫ్లయిట్ సిద్ధం చేసుకున్నారని, ఆయన కుప్పం ఎందుకు వెళుతున్నట్టు అని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ విలువలను మంటగలుపుతున్నారని విమర్శించారు.

దొంగ ఓట్లు వేయించే సంస్కృతి టీడీపీదేనని వ్యాఖ్యానించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంటే, భగ్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని, ఈ మేరకు తాము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేశామని లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు.

Lella Appireddy
Chandrababu
Kuppam
SEC
Municipal Elections
Andhra Pradesh

More Telugu News